Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పాత్ర మిత్రుల కలయిక ద్వారా మీకెంతో సంతృప్తినిస్తుంది.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

కుటుంబంలో సంతోషం, ఉత్సాహం నెలకొంటాయి. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నం అవుతారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు ఏమాత్రమూ ఉండవు. మీ ప్రత్యర్థులు మీ ఉన్నతిని, సమర్థతను గుర్తిస్తారు. స్త్రీలు సంభాషించేటపుడు సంయమనం పాటించండి. అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.


Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరంగా సమస్యలు తప్పవు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఉన్నతస్థాయి అధికారులకు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం లోపిస్తుంది. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. దూరపు బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుకున్న పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలున్నాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. నూతన పెట్టుబడులు మరికొంత కాలం వాయిదా వేయటం శ్రేయస్కరం. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా సంతృప్తి ఉండదు. వాహనం అమర్చుకుంటారు.

Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

మీ లక్ష్య సాధనకు ముఖ్యుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది.

Friday, 17 February 2017

18 ఫిబ్రవరి 2017

ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాభివృద్ధికై చేసే కృషిలో మంచి ఫలితాలుంటాయి.

Thursday, 16 February 2017

17 ఫిబ్రవరి 2017

నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. రాబడికి తగ్గట్లు ఖర్చులుండటం వల్ల ఇబ్బందులుండవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అనుకూలం.

Wednesday, 15 February 2017

16 ఫిబ్రవరి 2017

ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. సన్నిహితుల నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. కుటుంబ అవసరాలు, ఖర్చులు పెరగటంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడాల్సి వస్తుంది. పాత మిత్రులను కలుస్తారు.

Tuesday, 14 February 2017

15 ఫిబ్రవరి 2017

కలప, ఇటుక, ఐరన్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. నూనె, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు వ్యాపారస్తులకు అభివృద్ధి చేకూరుతుంది. ఇంజనీరింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు కళ, రచనలపట్ల ఆసక్తి పెరుగుతుంది.

Monday, 13 February 2017

14 ఫిబ్రవరి 2017

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణయత్నంలో ఆటంకాలను ఎదుర్కుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం.

Sunday, 12 February 2017

13 ఫిబ్రవరి 2017

దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలలో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఆస్థి వ్యవహారాల విషయంలో కుటుంబీకుల నిర్ణయం నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్‌లు అనుకూలిస్తాయి. దైవదర్శనం లభిస్తుంది.

Saturday, 11 February 2017

12 ఫిబ్రవరి 2017

పత్రిక, ప్రవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోను మీరే నిర్ణయం తీసుకోవటం మంచిది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. షేర్లు సామాన్యంగా ఉంటాయి.

Friday, 10 February 2017

11 ఫిబ్రవరి 2017

బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. మీ ఏమరుపాటుతనంవల్ల ధన నష్టం, విలువైన వస్తువులు చేజారిపోవటంలాంటి చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. చుట్టుప్రక్కలవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

Thursday, 9 February 2017

10 ఫిబ్రవరి 2017

ఉద్యోగస్తులకు ఏకాగ్రతా లోపం వల్ల పై అధికారులతో మాటపడాల్సి వస్తుంది. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి మొహమాటాలు ఎదురవుతాయి. విద్యార్థులకు అధిక కృషి చేసినా జయం చేకూరును. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు.

Wednesday, 8 February 2017

9 ఫిబ్రవరి 2017

మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులవల్ల ఒత్తిడి పెరుగుతుంది. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.

Tuesday, 7 February 2017

8 ఫిబ్రవరి 2017

ఉమ్మడి వ్యాపారాలు, లీజు ఏజెన్సీలకు అనుకూలం. స్త్రీలు ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. రుణ ప్రయత్నాలు, చేబదుళ్లు ఈ వారంలో తప్పవు. అనవసర ఖర్చులు సైతం వేధిస్తాయి.

Monday, 6 February 2017

7 ఫిబ్రవరి 2017

గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. సాంఘిక, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. హోటల్, తినుబండారాల రంగాలలోని వారికి చికాకులు తలెత్తుతాయి. విద్యా సంస్థలలోనివారు నిరుత్సాహం ఎదుర్కోవలసి వస్తుంది.

Sunday, 5 February 2017

6 ఫిబ్రవరి 2017

ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలోని వారికి మెలకువ అవసరం. క్రీడా రంగంలోని వారికి శుభదాయకం. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రిప్రజేంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయదార్లకు యోగదాయకం. ప్రయాణాలలో మెలకువ అవసరం.

Saturday, 4 February 2017

5 ఫిబ్రవరి 2017

ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులు ఇతరుల వాహనం నడపటంవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలు అకారణంగా నవ్వటంవల్ల కలిగే అనర్థాలను గుర్తిస్తారు. నిరుద్యోగులు రాత పరీక్షలలో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల్లోని వారికి అధిక శ్రమ తప్పదు.

Friday, 3 February 2017

4 ఫిబ్రవరి 2017

ప్లీడర్లకు చికాకు, వైద్యులకు శస్త్ర చికిత్స చేయునప్పుడు మెలకువ అవసరం. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహనా లోపంవల్ల సమస్యలు తప్పవు. వాహనం నడుపునపుడు మెలకువ వహించండి. హామీలు ఉండటంవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పారిశ్రామిక రంగాల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దైవ దర్శనాలు చేస్తారు.

Thursday, 2 February 2017

3 ఫిబ్రవరి 2017

ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాబడికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గతంలో చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆడిటర్లకు అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కీలకమైన వ్యవహారాలు గోప్యంగా ఉండండి.

Wednesday, 1 February 2017

2 ఫిబ్రవరి 2017

బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. షాపింగ్‌లో నాణ్యతను గమనించాలి. పెట్టుబడులకు తగిన సమయం కాదు. స్త్రీల సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కార్యక్రమాలకు స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగాల్సి ఉంటుంది. గతంలో నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు.