Saturday, 4 March 2017

5 మార్చి 2017

ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవపతాయి. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్‌లకు సంతృప్తి, ప్లీడర్లకు చికాకు తప్పదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు.

Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పాత్ర మిత్రుల కలయిక ద్వారా మీకెంతో సంతృప్తినిస్తుంది.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

కుటుంబంలో సంతోషం, ఉత్సాహం నెలకొంటాయి. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నం అవుతారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు ఏమాత్రమూ ఉండవు. మీ ప్రత్యర్థులు మీ ఉన్నతిని, సమర్థతను గుర్తిస్తారు. స్త్రీలు సంభాషించేటపుడు సంయమనం పాటించండి. అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.


Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరంగా సమస్యలు తప్పవు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఉన్నతస్థాయి అధికారులకు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం లోపిస్తుంది. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. దూరపు బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుకున్న పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలున్నాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. నూతన పెట్టుబడులు మరికొంత కాలం వాయిదా వేయటం శ్రేయస్కరం. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా సంతృప్తి ఉండదు. వాహనం అమర్చుకుంటారు.

Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

మీ లక్ష్య సాధనకు ముఖ్యుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది.