Tuesday, 31 January 2017

1 ఫిబ్రవరి 2017

తొందరపడి వాగ్దానాలు చేయటంవల్ల సమస్యలు ఎదుర్కోకతప్పదు. రాజకీయాలలోని వారికి చాలా మెలకువ అవసరం. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కరింపబడతాయి. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరని చెప్పవచ్చు. పత్రికా సంస్థలయందు పనిచేయువారికి సంతృప్తికరంగా ఉంటుంది.

Monday, 30 January 2017

31 జనవరి 2017

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెలకువ, ఏకాగ్రత అవసరం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవటంవల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఆలోచనలు, ఆశలను కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాల వారికి శుభదాయకం. ధరలు అధికమవుతాయి.

30 జనవరి 2017

ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. లౌక్యంగా వ్యవహరించటంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా కృషి చేయాల్సి ఉంటుంది.

Saturday, 28 January 2017

29 జనవరి 2017

వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు. ఆడిటర్లకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాలలోని వారికి చికాకు తప్పదు. ప్రైవేటు సంస్థల్లోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఐరన్, కలప, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం.

Friday, 27 January 2017

28 జనవరి 2017

చేపట్టిన వ్యాపారాలలో ఒకింత పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ట్రాన్స్‌పోర్ట్, మెకానికల్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం చేకూరుతుంది. నిరుద్యోగులు చిన్న సదవకాశం లభిస్తే సద్వినియోగం చేసుకోవటం మంచిది.

Thursday, 26 January 2017

27 జనవరి 2017

ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయం వృద్ధి పొందుతుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మొండి బకాయిలు సైతం వసూలు కాగలవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సంతానం మొండివైఖరివల్ల స్వల్ప చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం అవుతాయి.

Wednesday, 25 January 2017

26 జనవరి 2017

కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. వృత్తుల వారికి నిరుత్సాహం తప్పదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ప్రకటనపట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది.

Tuesday, 24 January 2017

25 జనవరి 2017

కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా సజావుగా పూర్తి చేస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి.

24 జనవరి 2017

ప్రింటింగ్, స్టేషనరీ రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. ఒంటెత్తుపోకడ మంచిది కాదని గమనించండి. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నా ఏకాగ్రత వహించలేరు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు.